నిరుపేదలకు ఆపన్న హస్తంగా ముఖ్య మంత్రి సహాయనిధి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  నిరుపేదలకు ఆపన్న హస్తంగా ముఖ్య మంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని    మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.   మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ డివిజన్ లోని పలువురికి  మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి  చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.  తెలంగాణ రాష్ట్రంలో  రెక్కాడితే, డొక్కాడని నిరుపేదలకి  ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లక్షలాది రూపాయలను అందజేయడం జరుగుతుందని మంత్రి  తెలిపారు. కార్యక్రమంలో లోకసాని కొండల్ రెడ్డి, ధర్పల్లి అశోక్, శ్రీనివాస్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.