నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలి…
సిపిఎం పట్టణ శాఖ కార్యదర్శి జల్లే జయరాజ్
కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం రోజున కేసముద్రం విలేజ్,ఎన్టీఆర్ నగర్,చైతన్య నగర్,కేసముద్రం స్టేషన్ ఎర్రగడ్డ కాలనీలో పక్క ఇల్లు లేని నివాసాల సర్వే సిపిఎం పార్టీ పట్టణ శాఖ కార్యదర్శి జల్లె జయరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించినారు.అనంతరం జయరాజ్ మాట్లాడుతూ… తెలంగాణలో ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటికీ ఇచ్చిన హామీ అమలు కాలేదని,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకులపై ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ,ఇంటి స్థలం ఉన్న వారికి, శిధిలావస్తలో ఉన్న ఇళ్లకు అదే స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇట్టి సమస్యలను పరిష్కరించాలని,ఈనెల 21న బుధవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి అందరూ తరలి రావాలని,జల్లే జయరాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీనివాస్,ఉప్పమ్మ ,సంతోష,స్వప్న,శ్రీలత,మౌనిక కౌసల్య ,మల్లయ్య, ఉపేంద్ర,మాధవి,శివ,ఏకాంత తదితరులు పాల్గొన్నారు.
Attachments area