నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
232 మందికి చెక్కుల పంపిణీ
* రాష్ట్ర మంత్రి గంగుల
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో 232 మంది లబ్ది దారులకు 95 లక్షల 82 వేల విలువగల చెక్కులను మీ సేవా కార్యాలయంలో పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
అనారోగ్యం బారిన పడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి రిలీప్ ఫండ్ వరంగా నిలుస్తుందన్నారు. తెలంగాణలోని నిరుపేదలను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ అందరివాడుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన లబ్దిదారులు సిఎం కెసిఆర్ కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ పట్టణానికి సంబంధించి 134 మంది లబ్దిదారులకు 56 లక్షల 60 వేల రూపాయల విలువజేసే చెక్కులు కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 35 మందికి 13 లక్షల 38 వేల 5 వందల రూపాయల విలువజేసే చెక్కులు కొత్తపల్లి మండలానికి చెందిన 32 మంది లబ్దిదారులకు 11 లక్షల 75 వేల 5 వందల రూపాయల విలువజేసే చెక్కులు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన 31 మంది లబ్దిదారులకు 14 లక్షల 8 వేల విలువ జేసే చెక్కులు మొత్తం 232 మంది లభ్దిదారులకు… 95 లక్షల 82 విలువజేసే చెక్కులను పంపిణీ చేశారు.
సిఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యం బారిన పడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడేవారికి అండగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న మంత్రి గంగుల దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో యావత్ దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల లబ్దిదారులు… సిఎం కెసిఆర్ కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు ,చల్ల హరిశంకర్ , గంట కల్యాణి ,శ్యామ్ సుందర్ రెడ్డి , సుంకి శాల సంపత్ రావు తదితరులు ఉన్నారు