‘నిరుపేద ఆడపిల్లల కోసం కళ్యాణలక్ష్మి పథకం’

Latest News

మెదక్: నిరుపేద ఆడ పిల్లల వివాహం కోసమే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలను చూసి విపక్షాలకు దిమ్మతిరిగి పోతోందని అన్నారు. అందుకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు కాలేజీలకు బకాయిపడ్డ రూ.16 వందల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వమే చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా జిల్లాల్లో 2,371 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సబ్సిడీ బకాయిలను చెల్లించామని మంత్రి తెలిపారు.