నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 జనం సాక్షి:జనగామ జిల్లా బచన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలు మార్తలక్ష్మి గత కొద్దరోజుల క్రితం చనిపోయిందని తెలియగా వాస్విక్ ఫౌండేషన్ ఛైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి మృతురాలు కుటుంబానికి ఫౌండేషన్ సభ్యులు ఆముధాల భూపాల్ రెడ్డి ద్వారా 50 కేజీల బియ్యం అందించడం జరిగినది. అడగగానే సహాయము అందించిన వాస్విక్ ఫౌండేషన్ కు కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం బాల్ రాజు ,పెద్ద చిట్టి రవిందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.