నిరుపేద గిరిజన కుటుంబానికి  ఆర్థిక సహాయం — కల్లూరి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండాలో నునవత్ కిషన్ తన భార్య నునవత్ బద్రి   అనారోగ్యంతో మృతి చెందారు,అతనికి ముగ్గురు ఆడపిల్లలు వారిది నిరుపేద కుటుంబం అని,ఈ విషయాన్ని గ్రామస్తులు తెలంగాణా పరిరక్షణ సమితి అధ్యక్షులు కల్లూరి రామచంద్ర రెడ్డి గారికి తెలపడంతో ఆయన పెద్ద మనస్సుతో వెంటనే స్పందిచి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అంధించారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిట్య నాయక్,తుర్కపల్లి మాజీ ఎంపీటీసి ఉమ్ల నాయక్,వార్డ్ సభ్యులు శ్రీనివాస్, టీఆర్ యస్  గ్రామ అధ్యక్షుడు వీరు నాయక్ నునవత్ కిషన్,తెలంగాణ పరిరక్షణ సమితి సభ్యులు,భూక్య సంతోష్ నాయక్,గడ్డ మీది యాదగిరి,మాధిగా వెంకట్ స్వామి, సుమన్, తదితరులు పాల్గొన్నారు.