నిర్బంధించిన వారిని విడుదల చేయాలి హరీష్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… తెలంగాణ వాదులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. చలో అసెంబ్లీకి మద్దతిస్తున్నామని చంద్రబాబు ఎందుకు ప్రకటించరని హరీష్‌రావు ప్రశ్నించారు. చలో అసెంబ్లీకి మద్దతు ఇప్పించాల్సిన బాధ్యత ఈ ప్రాంత మంత్రులదేనన్నారు.