నిర్భంధించిన వారిని విడుదల చేయాలి: హరీష్
హైదరాబాద్,(జనంసాక్షి): ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సన్నద్దమవుతోన్న తెలంగాణవాదులను అరెస్టు చేయడం అత్యంత దారునమని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదులపై అక్రమంగా కేసులు బనాయించడం ప్రభుత్వానికి హాబీగా మారిందని దేయ్యబట్టారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతినిప్పించాల్సిన బాధ్యత ఈ ప్రాంత మంత్రులదేనని ఆయన అన్నారు. తెలంగాణకు అడ్డుకాదని చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో అసెంబ్లీకి ఎందుకు మద్దతివ్వరని నిలదీశారు.