నిర్భయ తల్లిదండ్రుల కోణంలో చూడాలి

వారి క్షోభకు ఎవరు సమాధానం చెబుతారు

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి): నిర్భయ ఘటన కారణంగా భౌతికంగా మానసికంగా, ఆమె తల్లిదండ్రులు అనుభవించిన క్షోభను తక్కువ చేసి చూడరాదు. ఇలాంటి నేరాల్లోనే కాదు అనేక నేరాల్లో శిక్షలు కఠినంగా ఉండి, వాటి అమలు జరగాలి. ఏళ్లకు ఏళ్లు కేసులు కోర్టుల్లో నలగకుండా చర్యలు తీసుకోవాలి. సత్వర న్యాయం కావాలి. నిర్భయ కోరుకున్నట్టుగానే ఆమెను ఘోరంగా హింసించినవారికి తీవ్రమైన శిక్షేపడితేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరగలదు. ఆ తల్లిదండ్రులకు కొంతయినా ఊరట కలగగలదు. అలాగే అన్ని కేసుల్లోనూ ఇలాగే జరగాలి. అందుకే దీనిని స్టడీ చేసి తీర్పును ఇచ్చారు. 2013లో ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తే, ఆ మరుసటి ఏడాది హైకోర్టు దానినే ఖరారుచేస్తే, మూడేళ్ళ తరువాత సుప్రీంకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేయేడం ద్వారా తీవ్రతను తెలియచేసింది. ప్రధానంగా నిర్భయ మరణవాంగ్మూలం న్యాయమూర్తులను కదిలించివేసినట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ఏ దశలోనూ అనుమానించదగిన అంశాలేవీ లేవనీ, నిందితులు అత్యంత అమానుషంగా, కుట్రపూర్వకంగా తమ పైశాచికానందం కోసం శాడిస్టుల్లాగా ప్రవర్తించారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దోషులకు ఉరిశిక్షే సరైనదని నిర్థారించడం ద్వారా భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదన్న హెచ్చరిక చేసింది. 2012లో దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. నిర్భయ ఘటనతో యావత్‌ భారతావని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిర్భయకు న్యాయం జరగాలంటూ ఇలాంటి తరహా ఘటనలు ఇకవిూదట పునరావృతం కాకూడదని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో 2013లో నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. యాసిడ్‌ దాడులు, లైంగిక వేధింపులు,

మహిళల అపహరణ, మహిళల అక్రమ రవాణా వంటి కేసులు ఈ చట్టం కిందకు వస్తాయి. ఈ చట్టం అమలులోకి వచ్చి ఆరు సంవత్సరాలు కావస్తున్నా అత్యాచార నేరాలు తగ్గలేదు సరికదా.. ఏటికేడు పెరుగుతున్నాయని జాతీయ నేరాల నమోదు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే ఇలాంటి కృత్యాలను జరగకుండా కఠిన శిక్షల ద్వారానే అడ్డుకోవాల్సి ఉంది. ఉరిశిక్షను వ్యిరేకించే వారు నిర్భయ అనుభవించిన నరకాన్ని అనుభవిస్తేనే అర్థం అవుతుంది. నిజానికి నిర్భయ ఉదంతం ఒక ఘోరకలి. ప్రజలను తీవ్రంగా కదల్చివేసిన అమానుష ఘటన. దేశంలో హత్యలూ, అత్యాచారాలు జరగడం వాటిని మరచి పోవం వంటివి ఎన్నో జరుగుతన్నా ఈ ఒక్క కేసులోనే కఠిన శిక్ష పడింది. విజయవాడలో ఆయమేషా విూరా కేసులో ఇప్పటికీ న్యాయం జరగేలదు. ఈ తరహాకేసుల దర్యాప్తును వేగవంతం చేయడానికీ, మహిళలకు ప్రత్యేక రక్షణలు కల్పించే వ్యవస్థలను సృష్టించడానికి జస్టిస్‌ వర్మ కమిటీ ఏర్పడింది. దాని సూచనల మేరకు నేర శిక్షాస్మృతిలో మార్పు చేర్పులూ జరిగాయి. నిర్భయచట్టం అమల్లోకి వచ్చింది. అయినా అత్యాచారాలు, అమానుషాలు ఆగడం లేదు. అందువల్ల కేసులను త్వరగా ముగించి, బాధ్యలుకు ఉరిశిక్షలను త్వరగా అమలు చేస్తేనే మార్పు వస్తుంది. సమాజానికి సందేశాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఉరిశిక్షలు అమలు జరగాలి. తప్పు చేసిన వాడికి, ఒకరి జీవితాన్నినాశనం చేసిన వాడికి బతికే అర్హత లేకుండా చేయాలి. అప్పుడే సమాజం దారికొస్తుంది.