నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ

 

ఐఫా అవార్డుల వేడుకలో ఓ విలేఖరి ‘నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, మరీ బాలకృష్ణ నట వారసులు ఎవరు? అని ప్రశ్నించగా.. దానికి బాలయ్య ‘నా కొడుకు మోక్షజ్ఞ, నా మనవడు ఇంకెవరున్నారు’ అని సమాధానమిచ్చారు. అయితే ఈ సందర్భంలో బాలయ్య జూ.ఎన్టీఆర్ పేరును చెప్పకపోవడంతో తారక్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ప్రశ్న ‘నందమూరి వంశ వారసులు ఎవరు అనేది కాదు’ అందుకే బాలయ్య ఆ సమాధానం ఇచ్చారని నందమూరి ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.