నిర్మల్ జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు ఏర్పాటుచేసిన టవర్ వర్షాలకు కృంగి కూలీ పోయింది,సమీపంలో ఇల్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు అధికారులు గత మూడు సంవత్సరాల క్రితం టవర్ ను ఏర్పాటు చేశారు అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం నాణ్యత లోపంతో గత ఐదు రోజులుగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బుధవారం తెల్లవారు జామున టవర్ నేల కుంగి టవర్ కూలిపోయింది టవర్ సమీపంలో ఇల్లు పెద్దగ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క ఇంటి పక్కనే టవర్ కూలడంతో బాధిత కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు టవర్కు అనుకొని సదర్ మార్ట్ కెనాల్ ఉండడంతో టవర్ అటువైపు పడిపోయింది ఇటువైపు కార్యాలయం ఇల్లు ఉన్నాయి ఇటువైపు పడితే ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం అవ్వడంతో పాటు పలు ఇళ్లకు కూడా తీవ్ర నష్టం వాటి లేదని స్థానికులు తెలిపారు ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయలయనికి తాత్కాలికంగ ఇంటెర్నెట్ సేవలు నిలిచిపోయాయి ఇలాంటి నాణ్యత లోపంతో నిర్మించిన టవర్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని పలువురు స్థానిక నాయకుల అభిప్రాయపడ్డారు కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రతన్ ను వివరణ కోరగ వర్షాలకు నెల మొత్త బడి కులిందని తెలిపారు ఎవరికి ఏటువంటి ప్రమాదం జరగలేదన్నారు టవర్ కులిన విషయం ఉన్నతాధికారులకు తేలిపంమన్నారు ప్రస్తుతం సేవలు తాత్కాలికంగ నిలుప నున్నట్లు తెలిపారు.