*నిర్మల్ పట్టణం పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ గండ్రథ్ ఈశ్వర్

నిర్మల్  , జులై29,జనంసాక్షి,,,   వర్షకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రజలందరూ వ్యక్తి గత మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ గండ్రట్ ఈశ్వర్   సూచించారు.అపరిశుభ్రమైన పరిసరాలలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా,మెదడు వ్యాపి,వ్యాధులు సంభవించే అవకాశం ఉందన్నారు.ప్రతీ రోజు పట్టణములోని 42వార్డుల్లోమున్సిపాలిటీ ,పారిశుద్ధ్య సిబ్బంది, ట్రాక్టర్లు,ఆటోలు తో చెత్త సేకరణ కు వస్తుంటారు.వారికే చెత్త ను అందించాలి ఇంటి పరిసరాల్లో ఆరు బయట చెత్తనుపారేయకూడదన్నారు.
పట్టణంలోని శాంతినగర్ ,వినాయక్ నగర్ మరియు బోయివాడ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్ గారు పర్యటించారు.కాలనీఅంతటా పాదయాత్రగా తిరుగుతూ మురికి నీటి కాలువలను మరియు గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గుంతలుగా మారి ప్రజలకు , రాకపోకలకు ఇబ్బందులు ఉన్న రోడ్లను పరిశీలించారు.
బోయివాడ మరియు వినాయక్ నగర్ ప్రాంతంలో లోతట్టు ఏరియాలో ఆగిన డ్రైనేజీ వాటర్ , వర్షపు నీటిని పరిశీలించారు.ఈసందర్భంగా  మున్సిపల్ చైర్మన్  మాట్లాడుతూ…ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు వరద, నీరు ఒకే చోట నిలిచిపోవటంతో ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు.
గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి సూచనలు, సలహాలు తీసుకొని ఆయా వార్డుల్లో నిలిచిపోయిన వరద, డ్రైనేజీ నీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మురికి నీటి కాలువలు  ద్వారా మరియు వాటర్ మిషన్ ద్వారా చేసి నీటిని మళ్లించే ప్రకీయ కొనసాగుతుందన్నారు.
 రాష్ట్ర మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి  కృషి, సహకారంతో  TUFIDC ద్వారా నిధులు మంజూరు కావటం జరిగింది. రానున్న రోజుల్లో 42 వార్డుల్లో దశల వారికి ప్రజలకు డ్రైనేజీ, రోడ్డు వ్యవస్థ ఇబ్బంది గా ఉన్న ప్రాంతాల్లో నూతనంగా సి.సి.రోడ్లు మరియు డ్రైనేజీ మురికి నీటి కాలువలు నిర్మాణం చేస్తాం అన్నారు.
పట్టణ వార్డుల్లో ప్రధాన రోడ్డు భారీ వర్షానికి గుంతలు గా మారిన వాటిని ప్రస్తుతానికి నడవటానికి ఇబ్బంది గా ఉన్న దగ్గర తాత్కాలికంగా రోడ్డుమార్గం ఏర్పాటు చేస్తాం అన్నారు. ఆయన వెంట కమిషనర్ అరిగెల సంపత్ కుమార్,సానిటరీ యస్ దేవిదాస్,మురారి,కౌన్సిలర్ -శంకర్ పతి,కాలనీవాసులు,మున్సిపల్ సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు.