నిర్మల్ పట్టణము లోని 36 వ వార్డు బుధవార్ పేట్ లో నూతనంగా నిర్మించిన మాల సంఘ భవనాన్ని(అంబేద్కర్ భవన్) బుధవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంబించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పూల వేసి నివాళులర్పించారు. కాలనీ కి విచ్చేసిన మంత్రికి మాల కుల సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంఘ భవనంలో మొదటి అంతస్థు కు 12 లక్షలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.గాజులపెట్ వద్ద ఉన్న మాల స్మశాన వాటికను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. వార్డు లో పురాతన శివాలయం కు ప్రహరీ గోడ, ధ్వజ స్థంభం దేవాదాయ శాఖ నిధులతో నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తుందని అర్హులైన పేద లందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింప జేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభివృద్ధి కి పాటు పడుతున్నారని మంత్రి తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్ర వోతు రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,fscs చైర్మన్ ధర్మాజీ రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పట్టణ యూత్ అధ్యక్షుడు అప్పాల వంశీ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షుడు దేవర రాఘవేందర్, కత్తి సుధాకర్, TNGO”s అధ్యక్షుడు ప్రభాకర్,మాల సంఘ అధ్యక్షుడు రాజేశ్వర్,మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్,జనర్ధార్,గౌరవ అధ్యక్షుడు రాజలింగం, మహిళ సంఘాలు,కౌన్సిలర్స్ , కోఅప్షన్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు

నిర్మల్ పట్టణము లోని 36 వ వార్డు బుధవార్ పేట్ లో నూతనంగా నిర్మించిన మాల సంఘ భవనాన్ని(అంబేద్కర్ భవన్) బుధవారం రాష్ట్ర మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంబించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పూల వేసి నివాళులర్పించారు. కాలనీ కి విచ్చేసిన మంత్రికి మాల కుల సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంఘ భవనంలో మొదటి అంతస్థు కు 12 లక్షలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.గాజులపెట్ వద్ద ఉన్న మాల స్మశాన వాటికను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. వార్డు లో పురాతన శివాలయం కు ప్రహరీ గోడ, ధ్వజ స్థంభం దేవాదాయ శాఖ నిధులతో నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తుందని అర్హులైన పేద లందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింప జేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ  వర్గాల అభివృద్ధి కి పాటు పడుతున్నారని మంత్రి తెలిపారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్ర వోతు రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,fscs చైర్మన్ ధర్మాజీ రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పట్టణ యూత్ అధ్యక్షుడు అప్పాల వంశీ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షుడు దేవర రాఘవేందర్,
కత్తి సుధాకర్, TNGO”s అధ్యక్షుడు ప్రభాకర్,మాల సంఘ అధ్యక్షుడు రాజేశ్వర్,మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్,జనర్ధార్,గౌరవ అధ్యక్షుడు రాజలింగం, మహిళ సంఘాలు,కౌన్సిలర్స్ ,
కోఅప్షన్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు