నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వచేసిన వారిని పట్టుకున్న టాస్క్ఫోర్స్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 02(జనం సాక్షి)
నమ్మదగిన సమాచారం రాగా వల్లాల సూర్య ప్రకాష్ కిరాణం షాపు కాశీబుగ్గ నందు టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజర్గంజ్ పోలీసులు తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత అంబర్, జెకె జర్ధా, బ్లాక్ బాబా, స్వాగత్, , ఆర్ ఆర్ వి-1 ప్యాకెట్స్ వాటి విలువ 24,250/- రూపాయలు కలవాటిని స్వాధీన పరుచుకొనైనది. వల్లాల సూర్య ప్రకాష్ ను విచారించగా తాను చక్కిలం. రాజగోపాల్ వద్ద ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేశానని వాంగ్మూలం ఇవ్వగా అతనిని కూడా అదుపులోకి తీసుకోవడం అయినది. పై ఇద్దరిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడును. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంతసార్గంజ్ పోలీసులు తెలిపారు.