నీటిపారుదల విధివిధానాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ నవంబర్ 19 (జనంసాక్షి):
రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల విధివిధానాల రూపకల్పన, అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్ పలువురు ఉన్నతాధికారులతో నేడు సవిూక్ష చేపట్టారు. అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై 24న ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం నిర్వహణ. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచాలి. నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైన్ దాదాపు పూర్తయింది. లైడార్ సర్వే నివేదిక వచ్చినందున కార్యాచరణతో ముందుకెళ్లాలి. భూసేకరణ బిల్లుల చెల్లింపులో సరళ పద్ధతులు అవలంభించాలి. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయొద్దు. వాటర్‌గ్రిడ్‌కు బడ్జెట్‌లో ఏటా రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.