నీటి లభ్యత ఉన్నప్పుడు రిజర్వాయర్లు ఎందుకు?

2

– మల్లన్నసాగర్‌ అక్కర్లేదు

– రౌండ్‌ టేబుల్‌సమావేశంలో నిపుణులు

హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి):మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం పునరాలోచించు కోవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ వల్లప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువని అన్నారు. ‘మల్లన్నసాగర్‌ అవసరమా?’ అన్న అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు టి.హనుమంతరావు ఆడియో విజువల్‌ విధానం ద్వారా సాంకేతిక అంశాలను వివరించారు. మల్లన్నసాగర్‌ నిర్మించి తీరుతామని ప్రభుత్వం పంతాలకు పోవడం సరికాదని వక్తలు సూచించారు. పంటకు సరిపోయేంత నీటి లభ్యత ఉన్నప్పుడు రిజర్వాయర్‌ అవసరం లేదన్నారు. హర్యానాలో పంపుల ద్వారా నీటి సరఫరాచేస్తున్న తీరును అధ్యయనం చేయాలన్నారు. నీరు ఉన్నంతకాలం మాత్రమే తీసుకునే విదంగా పంపులతో తరలించవచ్చన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉండి వినియోగం ఎక్కువగా ఉంటేనే రిజర్వాయర్‌ అవసరం ఉంటుందన్నారు. ప్రాణహిత, కాళేశ్వరంలో నీటి నిల్వ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లు అవసరం లేదని హనుమంతరావు చెప్పుకొచ్చారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని మల్లన్న సాగర్‌పై పునరాలోచన చేయాలని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ కోరారు. దీనివల్ల లాభాం లేదన్న నిపుణలు సూచనలు పరిగణించాలన్నారు. హైదరాబాద్‌ నీటి కోసం అన్న విధానంలో అయితే ఏ మేరకు నిర్మించాలో ఆలోచన చేయవచ్చన్నారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం న్యాయ, చట్టబద్ధంగా వ్యవహరించాలని రాజకీయ కోదండరామ్‌ అన్నారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి.. దుర్భాషలాడి సంతకాలు తీసుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని… ప్రభుత్వం అమానుష వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్రణాళికలో చాలా లోపాలున్నాయని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు.  ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనన్నారు. 560 అడుగుల ఎత్తులో కాకుండా తక్కువ ఎత్తులో మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ కట్టొచ్చని తెలిపారు. చిన్న చిన్న రిజర్వాయర్లను కట్టి అంతే ప్రయోజనాలు పొందొచ్చని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్ల వ్యవస్థ వచ్చాక ప్రజాప్రయోజనాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని హరగోపాల్‌ అన్నారు. ఇదిలావుంటే ప్రాజెక్టులు, పరిశ్రమల పేరిట ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ అస్తవ్యస్తంగా ఉందని సీపీఎం ఆక్షేపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినదానికి.. క్షేత్రస్థాయిలో వ్యవహారాలు విరుద్ధంగా ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మల్లన్నసాగర్‌ కోసం 2013 చట్టం లేదా జీవో 123 ప్రకారం రైతులు ఏది కోరుకుంటే దాని ప్రకారమే పరిహారం ఇస్తామన్న సర్కారు మాటలు చేతల్లో అమలు కావడం లేదన్నారు. గ్రామసభలు నిర్వహించి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిహారం ప్రకటిస్తే పద్ధతిగా ఉండేదన్నారు. ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వాసితులు ఉద్యమాలు చేస్తున్నారని వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులా: హరగోపాల్‌

వర్షాభావం ఎక్కువగా ఉన్న ప్రాంతలలో రిజర్వాయర్‌ లు కట్టాల్సిన అవసరం లేదన్నారు రిటైర్డ్‌ ఇంజనీర్‌ టి.హనుమంతరావు. నీటి వినియోగం ఎక్కువ ఉన్న దగ్గర మాత్రమే ప్రాజెక్టులు కట్టాలన్నారు. ప్రాజెక్టులు నిర్మించే ముందు ముంపు బాధితుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు రిజర్వాయర్‌ కట్టాల్సిన అవసరం లేదన్నారు.మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు సంఘీభావంగా హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిపుణులు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్‌ కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నీటిపారుదల రంగ నిపుణులు హనుమంతరావు, ప్రోఫెసర్‌ హరగోపాల్‌ పాల్గొన్నారు.ప్రాజెక్టులతో భూమిని కోల్పోయిన రైతులకు.. ప్రాజెక్టు పరిసర ప్రాంతల్లో భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ప్రొ. హరగోపాల్‌. కాంట్రాక్టర్ల కోసమే  ప్రాజెక్టులను కడుతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్రణాళికలో చాలా లోపాలున్నాయని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌పై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనన్నారు. 560 అడుగుల ఎత్తులో కాకుండా తక్కువ ఎత్తులో మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ కట్టొచ్చని తెలిపారు. చిన్న చిన్న రిజర్వాయర్లను కట్టి అంతే ప్రయోజనాలు పొందొచ్చని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్ల వ్యవస్థ వచ్చాక ప్రజాప్రయోజనాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని హరగోపాల్‌ అన్నారు. నీటిపారుదల నిపుణులు హనుమంతరావు మాట్లాడుతూ నీటిపారుదల రంగంలో నీటి లభ్యత తక్కువగా ఉండి వినియోగం ఎక్కువగా ఉంటేనే రిజర్వాయర్‌ అవసరం ఉంటుందన్నారు. ప్రాణహిత, కాళేశ్వరంలో నీటి నిల్వ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లు అవసరం లేదని హనుమంతరావు చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో టీ.జేఏసీ చైర్మన్‌ కోదండరాం, విమలక్క హాజరయ్యారు.ముంపు నివారణకు  ప్రభుత్వం నిపుణుల సలహాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం. మొత్తంగా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం లేదంటున్నారు సామాజిక వేత్తలు. మరోవైపు ప్రాజెక్టును కట్టి తీరుతామంటోంది సర్కారు.