నీట్ ఫలితాలలో అల్ఫోర్స్ సంచలనం

 

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
నీట్ -2022 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో సంచలనం సృష్టించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దోమల అనుష్క 650 మార్కులతో అగ్రస్థానంలో నిలువగా యమ్ రుషిధర్ 614 మార్కులు , మహమ్మద్ హజ్జా అసద్ 571, జి.అక్షర 563, ఆర్.నిఖిల 552 , టి . శ్రీఅక్షిత 548 , టి . శ్రీవాణి 545 , దిల్షాదెమెహజాబిన్ 541 , ఎన్.మెర్లినోజ్యోతి 537 , కె.వర్ష 536 , యమ్.జ్ఞానద 532 , ఎస్.శివాత్మిక 529 , సయ్యద్ అలీ యమిన్ 523, వి. రష్మీత 523, సి.హెచ్. సాత్విక 520 , మదీహావాసి 515, యుస్రాఫాతీమా 508 , జి.సాత్విక 503 , హెచ్ . అపూర్వ 499, బి . సహాస్ర 499. బి. వైష్ణవి 496 , యమ్. ధిక్షితప్రియా 489, అర్.స్రవంతి 483 మార్కులు సాధించారు అని తెలిపారు. వీరితో పాటు సుమారు 50 మంది విద్యార్థులకు యమ్.బి.బి.ఎస్ సీటు సాధించే మార్కులు తెచ్చుకోవడం అల్ఫోర్స్ ప్రత్యేకత అని పేర్కొన్నారు . 500 ఆపై మార్కులు 18 మంది విద్యార్థులు 400 ఆపై మార్కులు 52 మంది విద్యార్థులు సాధించడం విశేషం అన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ విద్యార్థుల అకుంటిత దీక్ష కృషి వల్ల అల్ఫోర్స్ నీట్ -2022 లో ఇంతటి ఘన విజయం సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు . ఐ.పి.ఇ లో 468 మార్కులతో రాష్ట్రంలో ప్రథమస్థానంతో పాటు ఐ.ఐ.టి ( మేన్ ) లో 400 మంది అపై విద్యార్థులు అద్భుత మార్కులతో ఐ.ఐ.టి ( అడ్వాన్స్డ్ ) కి అర్హత సాధించారు . ఎమ్ . సె.ట్- 2022 లో అనేక మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ ఉత్తమ విద్యా బోధనకు నిదర్శనం అన్నారు. నీట్ -2022 లో అద్భుత మార్కులు సాధించిన మా అల్ఫోర్స్ ఆణిముత్యాలను వారి తల్లిదండ్రులను అభినందించారు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.