‘నీట్’ సబబే
` వైద్య విద్య.. అప్పట్లో ఒక్కో ‘పీజీ’ సీటుకు రూ.13కోట్లు!
` పరీక్షను ప్రవేశపెట్టడాన్ని సమర్ధించుకున్న కేంద్రం
దిల్లీ(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సమర్థించుకుంది. దేశంలో నీట్ రాకముందు వైద్య విద్య బహిరంగ వ్యాపారంగా ఉండేదని పేర్కొంది.అంతకుముందు ఒక్కో మెడికల్ పీజీ సీటు రూ.8 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు అమ్ముడు పోయిందని వెల్లడిరచింది. గతంలో వైద్యవిద్యలో భారీగా అవినీతి చోటుచేసుకుందని తెలిపింది.నీట్‌పై డీఎంకే నేత మొహమద్ అబ్దుల్లా రాజ్యసభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జోక్యం చేసుకున్నారు. నీట్ కంటే ముందు దేశంలో వైద్యవిద్యలో అవినీతి భారీగా ఉండేదని, తాను ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే నీట్‌ను తీసుకువచ్చామని చెప్పారు.’’గతంలో దేశంలో వైద్యవిద్య బహిరంగ వ్యాపారంగా సాగేది. తాను ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్‌ను తీసుకువచ్చాం. ఆ సమయంలో ఒక్కో పీజీ సీటు రూ.8కోట్లకు అమ్ముడుపోయింది. రేడియాలజీ వంటి విభాగాల్లో సీటు కావాలంటే మాత్రం రూ.12 నుంచి రూ.13కోట్ల వరకు ఖర్చుపెట్టాల్సి వచ్చింది’’ అని జేపీ నడ్డా వెల్లడిరచారు. నీట్ లేకముందు వైద్య విద్య పరీక్షల కోసం దేశమంతా తిరగాల్సి వచ్చేదన్నారు.