నీట మునిగిన పంటలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కృషి.
జులై 12(జనంసాక్షి)గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పత్తి, మినుములు,పెసరు , మిర్చి, తమట పంటలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట నాయక్ పంటపొలాలను సందర్శించారు.మంగళవారం వికారాబాద్ జిల్లా యాలాల మండల ఫరిదిలో ని మిశ్వనాథ్ పూర్ ,కోకట్ ,సంగంఖుర్దు గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలకు నీటమునిగిన పంట పొలాల రైతులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిహారం చెల్లించేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. అగ్రికల్చర్ అధికారులు మరియు ఎ.వో లు పంటపొలాలను సందర్శించి నష్టపరిహారాన్ని అంచన వేయాలని పేర్కొన్నారు. నీట మునిగిన పంటల నష్టపరిహారాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు