నీతిలేని మీరు మాపై అవినీతి ఆరోపణలా ?
బాజాపాపై సోనీయా ధ్వజం
ఎఫ్‌డీఐలు ప్రజాహితం కోసమే : ప్రధాని
మాది చేతల ప్రభుత్వం : రాహుల్
న్యూఢిల్లీ, నవంబర్ 4 (జనంసాక్షి):
పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన నీతిలేని ఎన్డీయే మాపై అవినీతి ఆరోపణలు చేయటంమేంటని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాందీ విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమం, సేవ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఉద్ఘాటించారు. పేదలకు సామాన్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతుల , నిరుపేదల పక్షపాతి అని ఆమె అన్నారు. ఆదివారం నాడు రాంలీలా మైదానంలో ప్రజాసదస్సు పేరిట జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అధినేత్రి సోనియాతోపాటు ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ఈ సభలో ప్రసంగించారు. ఎఫ్‌డీఐల అనుమతిపైన, ఇటీవల వస్తున్న అవినీతిఆరోపణలపైన విపక్షాలు సంధిస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రజా సదస్సు పేరుతో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ బల ప్రదర్శన జరిపింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టేందుకు ఈ సభను కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా ఉపయోగించుకుంది. సభలో ప్రసంగించిన ముగ్గురు ప్రధాన నేతలు విపక్షాలపై ధ్వజమెత్తారు. విపక్షాలు తమపై చేస్తున్న అసత్య ఆరోపణలకు ఈ సదస్సు జవాబు చెబుతుందని సోనియా గాంధీ అన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు. అవినీతికి పాల్పడిన వారెవరైనా ఉపేక్షించబోమన్నారు. అవినీతిపై తమ యుద్ధం కొనసాగుతుందని సోనియా ప్రకటించారు. అవినీతిపై అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని ఆరోపణలుచేసినా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ఎవరి తరమూ కాదని సోనియా అన్నారు. లౌకిక వాదంలో తమతో ఎవరూ పోటీ పడలేరని ధీమాగా చెప్పారు. తమపై నిందలు వేసిన వారికి అభివృద్ధితోనే జవాబిస్తామన్నారు. తమపై అవినీతి ఆరోపణలు చేసినవారే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని పరోక్షంగా బీజేపీపై ధ్వజమెత్తారు. తమపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనుఎదుర్కొనేందుకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్నారు. సమాజానికి అవినీతి క్యాన్సర్ వంటిందన్నారు. అవినీతి నిర్మూలనకు అంతా తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తమపై చేస్తున్న ఆరోపణలను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. తన నిజాయితీతో ఎవరూపోటీ పడలేరని చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచేందుకు విపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. దేశ అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలను తీసుకువస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించామని చెప్పారు. ఎఫ్‌డీఐలు అవసరమని గతంలో చెప్పిన వారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వమర్శించారు. పారదర్శకత పాలన కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నదన్నారు. ఈ క్రమంలో సమాచారం హక్కు చట్టాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి మరవలేనిదని, ఏ పార్టీ కూడా ఇంతగా కృషి చేయలేదన్నారు. బడుగు, బలహీన, శ్రామిక వర్గాల కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. నేడు రాంలీలా మైదానంలో జరుగుతున్న ప్రజా సదస్సు చరిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. 2004లో ప్రజల విశ్వాసాన్ని చూరగొని విజయం సాధించామని, అప్పటి నుంచి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని ఆమె చెప్పారు.
మాది ఆదర్శ పాలన: ప్రధాని మన్మోహన్‌సింగ్
ఎఫ్‌డీఐలు ప్రజాహితం కోసమేనని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఆదర్శప్రాయంగా యూపీఏ పాలన కొనసాగుతుందని ఎనిమిదేళ్ల పాలనలో అనేక అభివృద్ది సంక్షేమకార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఆదర్శపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారు. ఎన్నో విషయాలలో పలు దేశాలకు మన దేశం ఆదర్శంగా ఉందని ఆయన అన్నారు. ఆదివారం నాడు రాంలీలా మైదానంలో జరిగిన ప్రజా సదస్సులో ఆయన ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లుగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ఇక ముందు కూడా యూపీఏ ప్రభుత్వం ప్రజా సేవలో మరింత చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశామని ప్రధాని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కొంత మంది కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టస్తున్నారని విమర్శించారు. నిరాధార ఆరోపణలతో విపక్షాలుతమపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. విధానపరమైన నిర్ణయాలపై విపక్షాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దేశ భద్రత సమగ్రతలు కాపాడటంలో ఎన్నడూ వెనుకడుగు వేయలేదని ఆయన చెప్పారు. దేశ అభివృద్ధికి సంస్కరణలుఎంతో అవసరమని చెప్పారు. సంస్కరణల వల్ల ఎవరికీ ఎలాంటి ముప్పు ఉండదని భరోసా ఇచ్చారు. ఉద్యోగాల కల్పనకు సంస్కరణల అమలు తప్పనిసరి అన్నారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సంస్కరణల వల్ల రైతులకు, ఇతర వర్గాలకు ఎలాంటి నష్టం జరగబోదన్నారు. పేదరికం, నిరుద్యోగం నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 8 వేల కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరిందని ప్రధాని తెలిపారు.
మాది చేతల ప్రభుత్వం: రాహుల్ గాంధీ
మాది చేతల ప్రభుత్వమని అవినీతి నియంత్రణకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని రాహుల్‌గాంధీ అన్నారు. తమది చేతల ప్రభుత్వమేకాని, మాటల ప్రభుత్వం కాదని ఏఐసీసీ కార్యదర్శి రాహుల్‌గాంధీ అన్నారు. ఆదివారం రాంలీలా మైదానంలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ ఆమ్ ఆద్మీని ఎన్నటికీ మరిచిపోమని, సామాన్యున్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సామాన్యుడికి ఉత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో కృసి చేస్తోందని అన్నారు. పేదవాడి కష్టం గురించి కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఆలోచించడంలేదన్నారు. అయినప్పటికీ విపక్షాలు ప్రభుత్వంపై అర్థంలేనిఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గత ఎనిమిదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. సమాచార హక్కు చట్టం తెచ్చింది యూపీఏ ప్రభుత్వమేనని అన్నారు. ఈ చట్టం వల్ల పాలనలో ఎంతో పారదర్శకత వచ్చిందన్నారు. ఈ చట్టం వల్లే ప్రజలు నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుతున్నారని చెప్పారు. లోక్‌పాల్ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిసారి విపక్షాలు అడ్డుకున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవస్థ మంచి గురించి ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలపై సలహాలు ఇస్తే స్వాగతిస్తాం, అంతేకాని