నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ…
కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 5 నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులకు గురువారం నులి పురుగు నివారణ మాత్రలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తౌర్య తండ గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ తండ ప్రాథమిక పాఠశాలలో స్థానిక సర్పంచ్ భూక్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో నులి పురుగుల మాత్రలను పంపిణీ చేయగా,ఇనుగుర్తి గ్రామ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను ప్రిన్సిపాల్ విజయ లలిత, డాక్టర్ అనిల్ కుమార్ వేశారు.
Attachments area