నూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా ప్రజలకు అందుబాటులోనూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా ప్రజలకు అందుబాటులో పోలీస్ అధికారుల పనితీరు పై సంతృప్తి వ్యక్తం వెస్ట్ జోన్, ఇన్స్ప్ క్టర్  జనరల్ ఆఫ్ పోలీస్ వి. బి. కమలాసన్ రెడ్డి

 

 

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 13  నూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉందని వెస్ట్ జోన్ ఇన్స్ప్ క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వి. బి. కమలాసన్ రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం వెస్ట్ జోన్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.బి. కమలహాసన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా ఐ.పి.యస్ ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ లు కలిసి కోదండాపుర్ లోని అలంపూర్  వలయాధికారి కార్యాలయంను సందర్శించి కార్యాలయంలోని రికార్డులను, పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.తనిఖీలలో భాగంగా నమోదు అవుతున్న గ్రేవ్ కేసుల వివరాలను,  శాంతిభద్రతల నిర్వహణ పై ఆరాతీశారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు తదితర వివరాలను అలంపూర్ సిఐ సూర్య నాయక్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.బి. కమలహాసన్ రెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని  పోలీస్ స్టేషన్లలో నమోదయిన గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్, క్రైమ్ మెమోస్, క్రైమ్ డైజెస్ట్ రికార్డ్ లను, పి.టి కేసుల ఫైల్స్ ను, పెండింగ్ లో ఉన్నకేసులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అలాగే ప్రతి సిడి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, గ్రేవ్ కేసులలో యుఐని తగ్గించాలని సిఐ సూర్య నాయక్ ను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లలో  డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరిoచేటట్లు చూడాలని, అలాగే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనం నిరంతరం గస్తీ  నిర్వహించేటట్లు ఆయా పోలీస్ స్టేషన్ల  ఎస్సై ల ద్వారా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన పోలీస్ సేవలను అందించేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి  ప్రతి పోలీస్ స్టేషన్ లో  సిబ్బందికి సరిపడ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, చిన్న సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ ప్రభావం ఈ ప్రాంతం పై చూపడం వల్ల గతంలో ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఉండేదని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల ఫ్యాక్షనిజం లేకుండ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మెరుగుపడిందన్నారు. జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్, డిఎస్పీ రంగస్వామి లు విధులు పట్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జిల్లా కలెక్టరు, జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయంను నిర్మించడం జరిగిందని, అతి త్వరలో ముఖ్యమంత్రి చేతులా మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రికి పోలీస్ శాఖ తరుపున ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు. తనిఖీల అనంతరo అధికారులను, సిబ్బందిని విధుల పనితీరుపై అభినందించారు. ఈ కార్యక్రమంలో కోదండపురం ఎస్సై వెంకట స్వామి, ఉండవల్లి ఎస్సై బాలరాజు, ఇటిక్యాల ఎస్సై గోకారి, అలంపూర్ ఎస్సై శ్రీహరి,  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.