నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి
రాష్ట్ర ఎస్సీ నాయకులు పోకల శేఖర్
డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని రాష్ట్ర ఎస్సీ నాయకులు పోకల శేఖర్ డిమాండ్ చేశారు.బుధవారం పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణ ప్రదేశంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ తీర్మానం చేయడం యావత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నారు.మిగతా రాష్ట్రాలు సైతం తీర్మానించి కేంద్రానికి పంపాలని కోరారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.వార్డు కౌన్సిలర్ బాషిక అశోక్, బొరిగల శరత్,పేరాల నరసయ్య,గాజుల మల్లయ్య,బుట్టి విజయ్,వీరస్వామి,మేకల రామారావు,మాతంగి అనిల్,ఏసోబు,గాజుల నాగేష్,చంద్రం,గురవయ్య,ప్రవీణ్, ఏపూరి రమణ పాల్గొన్నారు.