నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం చరిత్రత్మక నిర్ణయం
– యాసం హరీష్ తెరాస పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి,మాదిగ జేఏసీ జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి.
మంగపేట,సెప్టెంబర్ 15 (జనంసాక్షి):-
దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చరితాత్మకమైనదని అందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత బంధు నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర అసెంబ్లీకి ప్రత్యేకమైన ఉద్యమ నమస్కారాలు అనీ యాసం హరీష్ తెరాస పార్టీ యువజన విభాగం ప్రధానకార్యదర్శి, మాదిగ జేఏసీ జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పక్షపాతి అని మొదటి నుంచి చెబుతున్న ప్రతిపక్ష నాయకులు వివిధ ప్రజాసంఘ నాయకులు వినలేదు అని యాసం హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కేవలం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తోనే ప్రయాణం చేయాలని, కొందరు మనువాద పగటి వేషగాళ్ల మాట విని అమ్ముడుపోవద్దని, మనువాద విషకోరులను చీల్చి చెండాడే నిజమైన దేశభక్తుడు, దళిత బహుజన పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని మరోసారి రుజువైందని అన్నారు.దేశ రాజధానికే అద్దం పట్టేలా నిర్మించిన భారత పార్లమెంటు భవనానికి ఈ దేశాన్ని అత్యద్భుతంగా నిర్మించిన రాజ్యాంగ నిర్మాత పేరు నామకరణం చేయాలనే గొప్ప మనసు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, వారి క్యాబినెట్ సభ్యులకు సలహాలు సూచనలు ఇచ్చి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం దళిత బహుజనలు అంతా ఆలోచించాలని రానున్న ఉపా ఎన్నికల్లో ముఖ్యమంత్రి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Attachments area