నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన జడ్పీటీసీ,యం పి పి*

కొడకండ్ల,ఆగస్టు 30(జనం సాక్షి )   రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం కొడకండ్ల మండల పరిధిలోని రేగుల ,రేగుల తండా, నర్సిగపురం, అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాలకు చెందిన  లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను  ప్రతీ ఇంటి ఇటికీ వెళ్లి అందచేసిన స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు.ఈ సందర్భంగా జడ్పీటీసీ కేలోత్ సతెమ్మ,ఎంపీపీ ధరవత్ జ్యోతి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్ప సాహసం దాతృత్వం కూడిన ఆలోచన 50 లక్షల మంది అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఒంటరి మహిళలలకు ఆసరా పెంక్షన్లను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని,
పేదల జీవితానికి భరోసా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేసిందని,
ఇచ్చిన హామీ ప్రకారం 57 సంవత్సరాలకు పెన్షన్లు
వృద్ధులకు, వితంతులకు, గీత, కార్మికులకు, చేనేత, బీడీ కార్మికులకు, బోదకాలు, హెచ్ఐవి, ఒంటరి మహిళలకు, డయాలసిస్ రోగులకు, 2016/- రూపాయలు, వికలాంగులకు  3016/- అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.పింఛన్ రానివారు అదైర్యపడవద్దని అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్స్ వస్తాయని అప్లై చేసుకొని వారు ఉంటే చేసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో  , స్థానిక సర్పంచులు , ఎంపీటీసీలు , వివిధ హోదలో ఉన్న ప్రజా&పార్టీ ప్రతినిధులు  , అధికారులు, తెరాస ముఖ్యనాయకులు , ఆసరా పెన్షన్ లబ్ధిదారులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.