నూతన బాధ్యతలు స్వీకరించిన డిగ్రీ ప్రిన్సిపాల్ డా.రహత్ ఖానం
మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి )
మహదేవపూర్ మండల కేంద్రంలో లోని డిగ్రీ కళాశాలకు అదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల నుండి బదిలీపై వచ్చిన డాక్టర్ రాహత్ ఖానం మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపక బృందం కళాశాల నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. విరిలో అధ్యాపక బృందం జీ.రమేష్,జన్ను విజయ్ కుమార్, కే.మునయ్య, వీ.రమేష్, టి. రజిత, డాక్టర్ డి.శ్రీనివాస్, డాక్టర్ పి.రాజు, వి.పరశురాములు, సిహెచ్.రాజేందర్, జి.రవీందర్, అస్ర సుల్తానా,డాక్టర్ ఎం.రాజన్న,ఎన్.మహేష్, నాన్ టీచింగ్ సిబ్బంది , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రిన్సిపాల్ ను అభినందించారు.
అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతు కళాశాల అభివృద్ధికి మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరత ఎంతైనా ఉందని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అధ్యాపక బృందానికి సూచించారు.