నూతన వధూవరులను ఆశీర్వదించిన కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్…లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్…
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 11:
మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఏఈ కొడకండ్ల కృష్ణమూర్తి కూతురు వివాహం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈవివాహ వేడుకలకు కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,రెడ్డి సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కొడకండ్ల సాంబమూర్తి, భూపతిరెడ్డి, ఎస్.కె. ఉమర్, మాజీ వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ బాబుమియా తదితరులు పాల్గొన్నారు.