నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి..రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం కల్పించినట్లే

– పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్
చౌడాపూర్, సెప్టెంబర్ 15( జనం సాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘసంస్కర్త,సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు,మహానీయుడు మహా మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నూతన సెక్రటేరియట్ కు పెట్టి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు స్వతంత్ర భారత,తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేళ రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం కల్పించినట్లు అయిందని సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ దళిత యువజన సంఘాల తరఫున తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ కార్యదర్శి మందిపాల్ వెంకట్  ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్,కర్ణాకర్,కుమార్ విజయ్ కుమార్,శివకుమార్,ప్రభాకర్,రమేష్ మొగిలిగిద్ద దాసు మరియు అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Attachments area