నూతన హోటల్ ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ఇటిక్యాల (జనంసాక్షి)ఆగస్టు 21 : మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి బీచుపల్లి పుణ్యక్షేత్ర సమీపంలో వేగ9 శాఖాహార హోటల్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహంతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం హోటల్ యజమాన్యం ప్రతాపరెడ్డి, తేజవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ లు మంత్రి నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. హోటల్ పరిసరాలను పరిశీలించిన అనంతరం మంత్రి హోటల్లో అల్పాహారం సేవించారు. తదనంతరం బీచుపల్లి సమీపంలోనే గోపాలకృష్ణ రాజేష్ ఏర్పాటు చేసిన జోగులాంబ చిన్న తరహా ఇనుప కర్మాగారాన్ని ఎమ్మెల్యే అబ్రహం తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెంది ప్రయోజకులు కావాలన్నారు. అలాగే తమ కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని మంత్రి యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జోగులాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీవాసరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఈర్లదిన్నె రంగారెడ్డి, గట్టు తిమ్మప్ప, మాజీ జడ్పిటిసి ఖగున్నాథ్ రెడ్డి, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, రమేష్ నాయుడు, నారాయణ నాయుడు, సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.