నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాన్ని ప్రారంభించిన ఆస్ట్రాక్

ఖైరతాబాద్ : జూన్ 22 (జనం సాక్షి)  సెఫ్రాలజీ, యూరాలజీలో సుమారు 73 విలువైన ఉత్పత్తులపై దృష్టి సారించేందుకు నగరంలోని ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రోక్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త నెఫ్రాలజీ, యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం అమీర్ పేట్  లోని మారీగోల్డ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రోచర్ ఆవిష్కరించిన అనంతరం ఆస్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ జిఎన్.విట్టల్ మాట్లాడుతూ… గత 12 సంవత్సరాలుగా ఆప్తాల్మాలజీ విభాగంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఆస్టాక్, ఫార్మాస్యూటికల్స్, సర్జికల్, ఇన్నోవేషన్ ఆధారిత హెల్త్ కేర్ గ్రూప్ ఒకటిగా ఉండటం అభినందనీయం అన్నారు. ఆస్టాక్ ఉత్పత్తులు, సేవలు రోగులు వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సత్వర, సమర్ధవంతమైన చికిత్సను పొందటానికి ఉపయోగ పడతాయన్నారు. ఆస్టాక్ లో నాణ్యత ప్రధానాంశమని అన్నారు. తమ ఉత్పత్తులన్నీ డబ్ల్యూ. హెచ్.ఓ/జిఎంపి స్టాండర్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు సీజిఎంపి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ), యూరాలజీ – సంబంధిత జబ్బులు, క్లిష్టమైన వ్యాధులను నయం చేయడానికి అధిక నాణ్యత, స్పెషాలిటీ, చికిత్సా, వైద్య ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సీమ,  పాల్గొన్నారు.