నెలాఖరుకల్లా రైతుబీమా వివరాల సేకరణ
మెదక్,జూన్26(జనం సాక్షి): రైతుబంధు బీమా దరఖాస్తుల స్వీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డీనేటర్ సోములు అన్నారు. రైతులు వెంటనే వివరాలు సమర్పించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయ శాఖాధికారులు రైతుల నుంచి సేకరిస్తున్న వివరాల గురించి ఎప్పటికప్పుడు అధికారులకు వివరిస్తున్నామని అన్నారు. రైతుబంధు బీమా దరఖాస్తు పారాలను పూర్తి చేస్తున్న తీరు తెన్నులను గురించి రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు బీమాలో ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు.18 నుండి 59 సంవత్సరాల వయస్సులోపున్న ప్రతి రైతు రైతుబంధు బీమా పథకంలో భాగస్వాములు కావాలన్నారు. రైతులు తమ ఆధార్‌కార్డు, ఫొటోలు, నామినీ తదితర వివరాలను వ్యవసాయశాఖాధికారులకు అందజేస్తే వారు దరఖాస్తు ఫారాలను పూర్తి చేస్తారన్నారు. రైతులు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వారి కుటుంబాలకు రూ.5లక్షలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందన్నారు.