నేటినుంచి అండర్‌-17 క్రికెట్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌ -17 క్రికెట్‌ పోటీలు చేయనున్నాయి.  జిల్లా క్రీడాభిమానులను  కనువిందుచేయనున్నాయి. ఈ నెల 18 నుంచి అందుకు ఏర్పాట్లు పర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా, డైట్‌ మైదానాలు వేదిక కానున్నాయి. ఈ పోటీల్లో పాత పది జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు, 20 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరు కానున్నారు. పోటీలు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో కొనసాగుతాయని నిర్వాహకులు  పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ క్రికెట్‌కు  పెట్టింది పేరయినా ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎందరో ఉన్నారు. నెట్సలో రాణించినా.. పోటీల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేక పోతున్నారు. శిక్షణా శిబిరాలు, అంతగా అవగాహన లేకపోవడమే నని అంటున్నారు. . 2017లో రాష్ట్రస్థాయిలో ఆదిలాబాద్‌ నాల్గో స్థానంలో, అంతకు ముందు 2016లో రన్నర్‌గా నిలిచింది. ఈ సారి రాష్ట్రస్థాయి పోటీలు ఆదిలాబాద్‌లో జరుగుతుండటం కలిసొచ్చే అంశం. అందుకే ఆదిలాబాద్‌ జిల్లా జట్టు ఛాంపియన్‌ కావడానికి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే  క్రీడల్లో విద్యార్థులందరు రాణించాలని ఐటీడీఏ డీడీ చందన పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల బోథ్‌ డివిజన్‌ స్థాయి క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడల్లో రాణించే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులందరూ తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొని నిత్యం ఆడాలని సూచించారు. ఈ సందర్భంగా బోథ్‌ నియోజవర్గంలోని 14 పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనగా బాల, బాలికలు కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖోతో పాటు వ్యక్తిగత క్రీడలు ఆడారు. గెలుపొందిన వారికి బహుమతులను డీడీ చేతుల విూదుగా అందజేశారు.