నేటినుంచి గ్రావిూణ డాక్‌ సేవల ఉద్యోగుల సమ్మె

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  గ్రావిూణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు  ఆలిండియా గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ వరంగల్‌ డివిజన్‌ కార్యదర్శి అప్పని రవీందర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలిండియా గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్‌, నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్ల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గ్రావిూణ తపాలా
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా ఉన్నతాధికారులు స్పందించక పోవడాన్ని నిరసిస్తూ నవంబర్‌ 14న సమ్మెకు పిలుపునివ్వడంతోపాటుగా ఉన్నతాధికారులకు నోటీసులు అందించినట్లు చెప్పారు. జీడీఎస్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌కు ఏరియల్స్‌ లెక్కింపు విధానాలను అనుసరించి 2016 నుంచి అమలు చేయాలని కోరారు. గ్రాట్యూటీ గరిష్ట పరిమితిని రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పెంచి గ్రూపు ఇన్సూరెన్స్‌ పరిమితి రూ.5లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. గ్రావిూణ తపాలా ఉద్యోగుల బదిలీ నిబంధనలను సరళతరం చేయాలని, డివిజన్‌ పరిధిలో బదిలీలు చేసే అధికారం సర్కిల్‌ అధికారికి కేటాయించాలని కోరారు.