నేటినుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం
నల్లగొండ,అక్టోబర్9(జనంసాక్షి): నాగార్జునసాగర్ విూదుగా శ్రీశైలం దేవస్థానానికి తెలంగాణ పర్యాటకశాఖ లాంచీలు నడిపేందకు సిద్ధమైంది. ఈ నెల 10న ప్రత్యేక ప్యాకేజీకీ శ్రీకారం చుట్టబోతున్నది. నదిలో నీరు విస్తారంగా ఉండడంతో లాంచీ ప్రయాణానానికి వీలు కలిగింది. అందులోభాగంగా ఒక్కో లాంచీలో 80 సీట్లు
కలిగిన రెండు లాంచీలను సిద్ధం చేసింది. వీటిని ప్రతీ బుధ, శుక్రవారాలలో వారానికి రెండ్రోజులపాటు నడిపించనున్నారు. నల్లమల అడవుల వీక్షిస్తూ క్షేత్రాలను దర్శిస్తూ నాగార్జునసాగర్ నీటి ద్వారా శ్రీశైలం దేవస్థానానికి చేరనున్నారు. పర్యటనలో భాగంగా సాగర్‌లో ప్రయాణిస్తూ అక్కడి నాగార్జునకొండలోని మ్యూజియాన్ని సందర్శించి, దిండిప్రాజెక్టు విూదుగా, టేయిల్‌పాండ్ ప్రాజెక్టు నీటిపై ప్రయాణించి లింగాలగుట్టకు చేరుకుంటారు. అక్కడినుంచి పర్యాటకశాఖ బస్సుద్వారా శ్రీశై లం దేవస్థానానికి చేరుకుంటుంది. ప్యాకేజీలో భాగంగా హరిత రిసార్ట్‌లో బసతోపాటు స్నాక్స్, భోజనం కల్పిస్తారు. ఈ పర్యటన ప్యాకేజీలో భాగంగా సాగర్‌లో రానుపోనుకు రూ. 3500 కాగా పిల్లలకు రూ.2,800, సింగిల్ వేకు రూ.1290గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి పెద్దలకు రూ.3,800 పిల్లలకురూ.3,500గా నిర్ణయించారు. ముందస్తు బుకింగ్‌లకు అవకాశం ఇచ్చారు.