నేటి అర్థరాత్రి నుంచి సమ్మెలో 108 సిబ్బంది..
హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే 108 అంబులెన్స్‌కు సంబంధించిన ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తె లిసిందే. దీంతో ‘108’ వైద్యసేవలు రాష్ట్రవ్యాప్తంగా స్తంభించనున్నాయి. సమ్మెపై ఉద్యోగులతో జీవీకే సంస్థ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఆ తర్వాత జీవీకేతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి సమ్మె నిలుపుదలకు ప్రయత్నించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కార్మికశాఖ ద్వారా చర్చలు జరపాలని ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత తమది కాదని, జీవీకేనే నియమించుకున్నందున తమకు సంబంధంలేదన్న వైఖరితో సర్కారు ఉంది.