నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు బంద్‌

హైదరాబాద్‌: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం నుంచి  దేవాలయలన్నింటిలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ దేవాలయాల అర్చక ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు గంగు భానుమూర్తి, కార్యదర్శి పి. మల్లికార్జున్‌ తెలియజేశారు. అర్చకలందరీకి ఆలయాలతో  సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించేందుకు 2007 డిసెంబర్‌లో చట్టం రూపొందించారని వివరించారు. ఐదు సంవత్సరాలు గడిచినా ఈ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. ఆగస్టు 1 నాటికి తమ సమస్యలు పరిష్కారించాలని, లేనిపక్షంలో 8 నుంచి ఆలయాలలో ఆర్జిత సేవలు నిలిపివేస్తామపి పేర్కొంటూ జూలై 4వ తేదీనే సీఎంకి వినతి పత్రం ఇచ్చామన్నారు.