నేటి నుంచి ఏకోపాధ్యాయులకు శిక్షణ వర్గ
ఇచ్చోడ, న్యూస్‌టుడే: గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ రామ మందిరం వద్ద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఏకోపాధ్యాయ పాఠశాలల పూర్తి సమయ కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ వర్గ ప్రారంభం కానున్నట్లుగా జనహిత ఏకోపాధ్యాయ పాఠశాలల జిల్లా అంచల్ అభియాన్ ప్రముఖ్ వి.సంతోష్, అంచల్ మూల్యాంకన ప్రముఖ్ డి.నాందేవ్‌లు తెలిపారు. ఆదివారం వారు ఇచ్చోడలో విలేకరులతో మాట్లాడుతూ ఏడు రోజుల పాటుగా జరిగే ఈ శిక్షణ వర్గ ఉధ్ఘాటన కార్యక్రమానిక గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, సంతుసదన్ నారాయణ్ మహరాజ్, అఖిల భారత విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధికారి సత్యంజీలు హాజరు కానున్నట్లు తెలిపారు.