నేటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యలన

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు జిల్లూర్‌ రహ్మాన్‌, ప్రధాని షేక్‌ హసీనా, విపక్షనేత ఖలేదా జియా తదితర నేతలతో రాష్ట్రపతి భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో జమాతే ఇస్లామీ నేత దిలావర్‌ హుస్సేస్‌ సయ్యదీకి మరణశిక్ష విధింపుతో చెలరేగిన హింసలో ఇప్పటివరకూ 50 మంది మృతి చెందారు. ఈ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.