నేటి నుంచి సోయా కొనుగోళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): హాకా ఆధ్వర్యంలో బోథ్‌ మార్కెట్‌ యార్డులో చేపట్టిన సోయా కొనుగోళ్లను డిసెంబర్‌ 1వ తేది నుంచి నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అరవింద్‌ పాటక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 1వ తేది నుంచి 3వ తేది వరకు కొనుగోళ్లను నిలిపివేశామని, తిరిగి డిసెంబర్‌ 4వ తేదిన కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.గిడ్డంగ్గుల్లో సోయా నిలువలు పేరుకుపోయినందున కొనుగోళ్లను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. ఇదిలావుంటే బోథ్‌ మార్కెట్‌ కమిటీ పరిధిలో చేపడుతున్న పత్తి కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని పాఠక్‌ కోరారు. జిన్నింగ్‌ ఫ్యాక్టరీల యజమానులు, ట్రేడర్లు, రైతులతో సమావేశం నిర్వహించారు. గతంలో ఆదిలాబాద్‌లో ఏరోజుకారోజు నిర్ణయిస్తున్న ధరనే ఇక్కడ చెల్లించాలని రైతులు కోరుతున్నారన్నారు. తేమ పేరుతో కోత విధించవద్దని సూచించారు.