నేటి నుంచి 50 వేల మంది భూమిలేని నిరుపేదల పాదయాత్ర

న్యూఢిల్లీ: దేశంలో భూమిలేని నిరుపేదల ‘ జన సత్యాగ్రహం’ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా 26 రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలు ఎన్టీవో ఏక్తా పరిషత్‌ ఆధ్వర్యంలో గ్వాలియర్‌ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఇన్ని వేల మంది పాదయాత్ర చేపట్టడం దేశంలో ఇదే ప్రధమం.  మొత్తం 350 కిలోమీటర్ల దూరాన్ని వీరు నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. జాతీయ భూ సంస్కరణల పాలసీని తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. వీరి ఆందోళనపై స్పందించిన కేంద్రం.. ఏక్తా పరిషత్‌ ఛైర్మన్‌ రాజగోపాల్‌తో చర్చలు జరపాల్సిందిగా మంత్రులు .జైరాంరమేష్‌ భేటీ అయ్యారు. వారి డిమాండ్ల న్యాయమైనవేనని…వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే వీటిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి కనీసం ఆరు నెలల సమయం కావాలని కోరారు.  సమస్యల పరిఫ్కారానికి ఈ నెల 11న ఆందోళనకారులు తమతో సమావేశం కవాలని ఆహ్వానించారు. ఈ భేటీకి హాజరయ్యేందుకు నిరసనకారులు అంగీకరించారు. అయితే దేశ రాజధాని వరకూ పాదయాత్రను మాత్రం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.