*నేటి నుండి రైతులకు జీలుగ విత్తనాలు సిద్దం*

మునగాల, జూన్ 02(జనంసాక్షి): 2022-23 సంవత్సరం వానాకాలానికి సంభందించిన జీలుగ విత్తనములు మునగాల మండల వ్యవసాయ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని మునగాల మండల వ్యవసాయ అధికారి బి. అనిల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 250 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని,  ఒక్కక్క బస్తా 30కేజీలు ఉంటుందని, 30కేజీల జీలుగ విత్తనాల ధర రూ.1897.50గా ఉందని తెలిపారు. అయితే సబ్సిడీపై రూ.1233.30 లకే అందజేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రూ.664.20లకు రైతులకు అందుబాటులో ఉనదన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు దరఖాస్తు పత్రాన్ని నింపాలని, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జీరాక్స్ పత్రాలు అందజేయాలని ఆయన కోరారు. కావలసిన రైతులు ప్రాథమిక సహకార సంఘం మునగాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.