నేటి యువతకు ఆదర్శప్రాయుడు భగత్ సింగ్
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్
పానుగల్, సెప్టెంబర్28, జనంసాక్షి
నేటి యువతకు భగత్ సింగ్ ఆదర్శప్రాయుడని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ తెలిపారు.
బుధవారం మండల పరిధిలో కేతేపల్లి గ్రామంలోని భగత్ సింగ్ నగర్ లో, భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ 23 ఏళ్ల వయస్సులో దేశ ప్రజల విముక్తి కోసం ఉరికొయ్యను ముద్దాడిన త్యాగధనుడు భగత్ సింగ్ అని,బ్రిటిష్ పార్లమెంటులో బాంబులు విసిరి పారిపోకుండా బ్రిటిష్ వారికి ఎదురెళ్లిన ధైర్యవంతుడని, భారత స్వాతంత్ర ఆకాంక్షను చాటిన మహానుభావుడని, కొనియాడారు. స్వతంత్రం తర్వాత కూడా పాలకుల వైఫల్యం, స్వార్థం వల్ల త్యాగమూర్తి ఆశయాలు నెరవేరలేదన్నారు. యువతరం ఆయన స్ఫూర్తితో దేశంలో నెలకొన్న స్వార్థం దరిద్రం, అవినీతి ,నిరుద్యోగం, అసమానతలను తరిమికొట్టేందుకు కంకణ బద్ధులై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య సీనియర్ నాయకులు మాల కుర్మయ్య, చిన్న కురుమయ్య, కురువ హనుమంతు, వార్డు మేంబర్ పెంటయ్య, కురువ పెంటయ్య, వేమన్న, యువజన నాయకులు కాకం రాముడు, రామాంజనేయులు, వెంకటస్వామి, లచ్చయ్య, సంగనమోని రాముడు, కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area