నేడు ఆర్జిత సేవాటిక్కెట్లు విడుదల
తిరుమల,మే31(జనం సాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టిటిడి శుక్రవారం విడుదల చేయనుంది. సెప్టెంబరు మాసానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఉదయం 10గంటల నుంచి అందుబాటులో ఉంచుతుంది. ప్రతి నెలా 50వేలకు పైగా టిక్కెట్లు విడుదల చేస్తుండగా సెప్టెంబరులో వార్షిక బ్ర¬్మత్సవం నేపథ్యంలో ఆర్జిత సేవల రద్దు కారణంగా కోటా చాలా వరకు తగ్గిపోనుంది.ఆన్‌లైన్ డిప్ విధానంలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను కేటాయించనుంది. టిక్కెట్ల విడుదల సమయం నుంచి 4రోజుల పాటు నమోదు అవకాశం కల్పిస్తుంది. అనంతరం డిప్ విధానంలో టిక్కెట్ల కేటాయింపు, నగదు చెల్లింపునకు అవకాశం ఇస్తుంది. ఆన్‌లైన్ జనరల్ కేటగిరి కింద విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్ర¬్మత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లు విడుదల చేస్తుంది. వీటిని వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే డయల్ తితిదే ఈవో కార్యక్రమాన్ని ప్రతినెలా మొదటి శుక్రవారం నిర్వహిస్తున్నారు. 1వ తేదీ ఉదయం 8.30 నుంచి 9.30 వరకు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ 0877-2263261 నంబర్‌లో భక్తులతో నేరుగా మాట్లాడనున్నారు. తిరుమబలకు సంబందించి సమస్యలను ప్రస్తావిస్తే అందుకు తగిన విధంగా స్పందిస్తారు.