నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం
న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ అధికారుల సంయుక్తబృందం ఆదివారం ఇటలీకి వెళ్లనుంది. ఈ వ్యవహారంపై ఇటలీలోనూ విచారణ జరుగుతున్న దృష్ట్యా.. భారతీయ అధికారులు అక్కడి విచారణ అధికారులను కలిసి సమాచారాన్ని సేకరించనున్నారు. ఆగస్టా కేసుకు సంబంధించిన దస్త్రాలను తమకు అందించాలన్న ఇటలీలోని భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తిని స్థానిక న్యాయమూర్తి తిరస్కరించారు. కేసు విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున నిబంధనల ప్రకారం సమాచారాన్ని బయటకు వెల్లడించలేమని తెలిపారు. విచారణ ప్రాథమికదశను దాటిన తర్వాత భారత్ మరొకసారి విజ్ఞప్తి చేస్తే సమాచారాన్ని ఇచ్చే విషయాన్ని పరీశీలిస్తామన్నారు.