నేడు ఓటరు నమోదుపై కలెక్టర్ రేడియో ప్రసంగం
వరంగల్, నవంబర్ 1 : జిల్లాలో ఓటర్ల నమోదు, ప్రత్యేక రివిజన్ అంశాలపై శుక్రవారం ఉదయం 7.15కు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రసంగం ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ప్రసారమవుతుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఓట్ల నమోదుకు చేపట్టిన వివరాలను కలెక్టర్ వివరిస్తారు. దీనితో పాటు జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆదివారం ఉదయం 7.15 వరంగల్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో ప్రసారమవుతుందని వరంగల్ కేంద్ర ప్రతినిధి జయపాల్‌రెడ్డి తెలిపారు.