నేడు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

q5z681l7మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఇవాళ పర్యటించనున్నారు. జగదేవ్‌ పూర్‌ మండలంలోని ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం ఈ రెండు గ్రామాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో జరగనున్న కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. స్థానికంగా అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు.