నేడు చంద్ర గ్రహణం
నేడు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం
భక్తులకు దర్శనములు నిలిపివేయడం జరిగిందని, ఉదయం 8 గంటల నుండి దేవాలయం మూసి వేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏరువ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్నం 2:37 నుండి సాయంత్రం 6:19 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందువల్ల ఆలయం మూసి ఉంచబడుతుందని చెప్పారు.బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం పదిగంటల నుండి తిరిగి భక్తులకు దర్శన భాగ్యము లభిస్తుందని తెలిపారు.ఈ గ్రహణము భరణి నక్షత్రంలో సంభవిస్తున్నందువల్ల భరణి నక్షత్రం వారు మేష , కుంభ , మీనరాశుల వారు గ్రహణము చూడకూడదని, అందరూ ఉదయం 8 గంటల లోపు భోజనాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు.