నేడు టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

ఖమ్మం ఎడ్యుకేషన్‌, జనంసాక్షి: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో నెం:33ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధాంచిన సమాచారాన్ని గురువారం డీఈవో రవీంవూదనాధ్‌రెడ్డి  తెలిపారు. ఉపాధ్యాయులు సిఫార్సులు ,ఎలాంటి పైరవీలకు తావు లేకుండా కౌన్సెలింగ్‌ ద్వారానే బదిలీ నిర్వహిస్తామన్నారు. సాధారణ బదిలీలపై విశేషం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పాఠశాలలో  బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇప్పటికే అంతర్‌ జిల్లాల బదిలీలు పూర్తి చేశారు. విద్యాసంవత్సరం ఉపాధ్యాయుల బదాలీలు కౌన్సెలింగ్‌ ద్వారానే నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. నేరుగా బదిలీలు చేయడం వల్ల నిబందలు అతిక్షికమిస్తూ కావల్సిన చోటుకు బదిలీ చేయించుకోవటంతో ప్రభుత్వానికి అపఖ్యాతి వస్తుందని కౌన్సెలింగ్‌ ద్వారానే బదిలీలు చేపడుతున్నారు.

ఒకే ప్రాంతంతో ఐదు సంవత్సరాలు పైబడి పని చేస్తున్న  ఉపాధ్యాయులు , బదిలీ కొరకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11గంటకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హజరుకావాల్సి ఉంటుంది. ఒకే పాఠశాలలో 2013 జనవరి నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకే పాఠశాలో 8సంవత్సరాల సర్వీసుపూర్తయిన విరిని తప్పరిసరిగా బదిలీ చేయనున్నారు. పదవివీరమణకు రెండు సంవత్సరాల్లోపు సర్వీసు ఉన్నవారు సర్వీసు ఒకే చోటయ ఎనిమిదేళ్లు నిండిన వారు అంగీకారం లేకుండా బదిలీ చేయరు.  రేషనలైజేషన్‌ కారణంగా పోస్టు కోల్పోయి నష్ట పోయిన ఉపాధ్యాయులకు 10పాయింట్లు కేటాయించనున్నారు. బాలికల హైసూల్లో పని చేయనున్న 50ఏళ్ల పురుష ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు.