నేడు టీమిండియా ప్రపంచకప్ జాబితా ఎంపిక

న్యూఢిల్లీ: ప్రపంచకప్ లో ఆడే టీమిండియా తుదిజట్టును మంగళవారం బీసీసీఐ ఖరారు చేయనుంది. ఐసీసీ నిబంధనల మేరకు ఈనెల 7 లోపు ప్రపంచకప్ కోసం అన్ని జట్లు తమ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉండటంతో  15 మంది కూడిన భారత జట్టును ఈ రోజు బీసీసీఐ ఎంపికచేయనుంది. దీంతోపాటు ఇంగ్లండ్, ఆసీస్ తో జరిగే ముక్కోణపు సిరీస్ కూడా టీమిండియా ఆటగాళ్లను ప్రకటించనున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేరును వరల్డ్ కప్ కు ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉంది.

కాగా  ఆసీస్ టూర్ లో గాయపడిన జడేజా కోలుకోలేకుంటే మాత్రం ప్రపంచకప్ జట్టులో అతడి స్థానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేయాలని భావనలో సెలెక్టర్లు ఉన్నారు.

ప్రపంచకప్ జాబితాలో  ఈ ఆటగాళ్లు ఉండే అవకాశం..
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానే, శిఖర్ ధావన్,  సురేష్ రైనా, అంబటి రాయుడు, ఆర్.అశ్విన్, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీలు తుది జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 15 ఆటగాడి ఎంపికలో కాస్త సందిగ్ధత ఏర్పడింది. ఆ స్థానంలో రవీంద్ర జడేజా పేరు ప్రధానంగా  వినిపిస్తోంది. ఒకవేళ గాయం కారణంగా జడేజాను ఎంపిక చేయకపోతే ఆ స్థానంలో యువరాజ్ ను తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.