నేడు డైట్‌సెట్ కమిటీ సమావేశం
హైదరాబాద్: డీఈడీ కౌన్సెలింగ్ తేదీలు, ఏర్పాట్లు, కళాశాలల అనుమతులపై చర్చించేందుకు డైట్ సెట్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ నెల 26 లేదా 27న డైట్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్ నిర్వహణపై విద్యార్థుల నుంచి ఒత్తిడి రావడంతో ఇప్పటి వరకూ 121 కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతి ఇచ్చారు. రెండో దశ కౌనెల్సింగ్ నాటికి మరికొన్ని కళాశాలలకు అనుమతి వచ్చే అవకాశం ఉంది.